విజయనగరం పట్టణంలో ఆదివారం ఉదయం 'ఆరోగ్య యజ్ఞం'పై అవగాహన ఆచార్య విశ్వ ప్రేమ్ సుహాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డా. డి రవితేజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధన, ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం పెట్టే శ్రద్ధ, ఔషధీకృత అమృత ఆహారం తయారు చేసుకునే విధానం పై అవగాహన, తదితర అంశాలపై వివరించి, సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.