విజయనగరం పట్టణం కృష్ణ థియేటర్ వద్ద సోమవారం భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు నగర సిపిఎం కార్యదర్శి రెడ్డి శంకర్రావు ఆధ్వర్యంలో జరిగాయి. బ్రిటిష్ పాలన నుండి దేశాన్ని విముక్తి చేయడానికి ప్రాణాలర్పించిన భగత్ సింగ్ ను స్మరించుకున్నారు. దేశాన్ని కార్పొరేట్ శక్తులు, మతోన్మాద శక్తుల నుండి కాపాడటానికి ప్రజాస్వామ్య, లౌకిక
భారతదేశం కోసం ఉద్యమించాలని శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ త్యాగాలను కొనియాడారు.