రక్తదాతలకు సన్మానం, రక్త నిధి కేంద్రంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం

142చూసినవారు
రక్తదాతలకు సన్మానం, రక్త నిధి కేంద్రంలో ప్రపంచ రక్తదాత దినోత్సవం
విజయనగరం ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి రక్త నిధి కేంద్రంలో ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యధిక సార్లు రక్తదానం చేసిన బొడ్డేపల్లి రామకృష్ణారావు, చైతన్యవర్మ, దుర్గా ప్రసాద్, సురేష్, మహేష్, అరుణ్ కుమార్ వంటి దాతలను ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవి మాధవి, రక్త నిధి కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. స్వాతిలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్