ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతి రావు మాట్లాడుతూ ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు, నిల్వ చేసిన ఆహార పదార్థాలు, బేకరీ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్ వినియోగం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఆకుకూరలు, పండ్లు, పాలు వంటి పోషకాహారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చని సూచించారు. విశాఖపట్నం ఒమేగా హాస్పిటల్‌కు చెందిన ఆంకాలజీ సర్జన్ డాక్టర్ శృతి వేగసేన సుమారు వందమంది మహిళలకు పాప్ స్మియర్ పరీక్షలు, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, క్యాన్సర్ పై అవగాహన కల్పించారు.