తిరుపతి లడ్డు ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, దీనిపై చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, సిట్ నివేదికతో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు అబద్ధమని స్పష్టమైందన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అనవసర అనుమానాలు కలిగించారని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని పేర్కొన్నారు.