బాల్య వివాహాలు చేస్తే జైలుకే

450చూసినవారు
బాల్య వివాహాలు చేస్తే జైలుకే
బాల్య వివాహాలు చేయడం లేదా ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించబడుతుందని విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్