అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రాజెక్టుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారంపై సమగ్రంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా చూడాలని, నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించారు.