జిల్లాలో పల్స్ పోలియోకార్యక్రమానికి కలెక్టర్ రెడ్డి శ్రీకారం

351చూసినవారు
జిల్లాలో పల్స్ పోలియోకార్యక్రమానికి కలెక్టర్ రెడ్డి శ్రీకారం
విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదివారం విజయనగరంలోని కనపాక యూత్ హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా తల్లిదండ్రులు సహకరించాలని, పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని తల్లిదండ్రులకు సూచించారు.

సంబంధిత పోస్ట్