విజయనగరంలో అక్టోబర్ 25, 26న సాంస్కృతిక కార్యక్రమాలు

3చూసినవారు
విజయనగరంలో అక్టోబర్ 25, 26న సాంస్కృతిక కార్యక్రమాలు
విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో అక్టోబర్ 25, 26 తేదీలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెన్యూ ఇంచార్జ్ ఆర్. డబ్ల్యూ. ఎస్. ఎస్. తెలిపారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనాలనుకునేవారు తమ వివరాలను ఈ నెల 7వ తేదీలోపు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో అందజేయాలని సూచించారు. క్లాసికల్, సెమి క్లాసికల్, భక్తి సంగీతం, మృదంగం, వయోలిన్, వీణ, ఫ్లూట్, నాదస్వరం, డోలు, బృంద నృత్యాలకు మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్