గత 27వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జిల్లా కోర్టులో జరిగిన మీడియేటర్ శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. సీనియర్ ట్రైనర్లు ప్రమీలా ఆచార్య (రాజస్థాన్), సిరాజ్ మహమ్మద్ (కేరళ) ఉమ్మడి విజయనగరం జిల్లాలోని న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ ముగింపు సందర్భంగా, జిల్లా జడ్జి ఎం.బబిత మాట్లాడుతూ, శిక్షణ పొందిన మీడియేటర్లు, ట్రైనీలు తమ విధులను సక్రమంగా నిర్వహించి, కక్షిదారులకు న్యాయం చేయాలని సూచించారు.