అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ మాట్లాడుతూ బాలలు పనుల్లో కాకుండా బడిలో ఉండాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బాలలను పనుల్లో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల కార్మికులు, బాల్య వివాహాల సమాచారం ఉంటే 1098, 100/112 నంబర్లకు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, బాలల హక్కుల సంఘాల ప్రతినిధులు,
విద్యార్థులు పాల్గొన్నారు.