శ్రీరామ మందిరం విగ్రహ ప్రతిష్ట మహోత్సవములోపాల్గొన్న మాజీ మంత్రి

3చూసినవారు
శ్రీరామ మందిరం విగ్రహ ప్రతిష్ట మహోత్సవములోపాల్గొన్న మాజీ మంత్రి
మెంటాడ మండలం కైలాం గ్రామంలో శ్రీరామ మందిరం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి పీడిక. రాజన్నదొర, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స. అప్పలనరసయ్య పాల్గొన్నారు. వారు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.