గుండాలపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

510చూసినవారు
విజయనగరం మండలం, గుండాలపేట గ్రామంలో తమన్నా ఫౌండేషన్, శ్రీనిధి మల్టీస్పెషలిటీ హాస్పిటల్, పుష్పగిరి కంటి ఆసుపత్రి సంయుక్తంగా శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. డెంటల్ కేర్ సేవలు కూడా అందించారు. గ్రామ సర్పంచ్ కంది జగదీశ్వరి శిబిరాన్ని ప్రారంభించి, ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్, శ్రీనిధి భాను ప్రసాద్, భీమ్ శంకర్, సంచాలన ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్