విజయనగరంలో
జనసేన నాయకురాలు గురాన రాధిక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కేసుల విచారణకు హాజరుకాకుండా నాటకాలు ఆడటం మానుకోవాలని, తప్పు చేయకపోతే పోలీసులకు లొంగిపోవాలని ఆమె సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలను సహించేది లేదని, తప్పుడు విమర్శలు చేస్తే స్వయంగా వెళ్లి పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు.