గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం హర్షణీయం.. రామకృష్ణారావు

4చూసినవారు
గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడం హర్షణీయం..  రామకృష్ణారావు
నవయుగ వైతాళికుడు, మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 21వ తేదీని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ప్రముఖ సామాజిక కార్యకర్త, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు) ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం గురజాడ అప్పారావు సాహిత్య సేవకు దక్కిన గౌరవమని ఆయన అన్నారు. ఆయన రచనలు నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్