మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై విజయనగరం జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్‌లో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఆదివారం ఫిర్యాదు చేశారు. అంబటి వ్యాఖ్యలు జంతువులకు అవమానకరమని, నీచంగా ఉన్నాయని నాగార్జున అన్నారు. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దురదృష్టకరమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన అంబటిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.