విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణికురాలికి తప్పిపోయిన డబ్బులు అప్పగింత

1053చూసినవారు
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణికురాలికి తప్పిపోయిన డబ్బులు అప్పగింత
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దేవి అనే ప్రయాణికురాలు విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు ఎక్కే సమయంలో తన వద్ద ఉన్న 23,000 రూపాయలున్న మనీ పర్స్ పోగొట్టుకున్నారు. కాంప్లెక్స్‌లోని ఇతర ప్రయాణికులు ఆ మనీ పర్సును గుర్తించి స్టేషన్ మేనేజర్‌కు అందజేశారు. పోగొట్టుకున్న ప్రయాణికురాలు డిపోకు వచ్చి అడగగా, ఆమె వివరాలు తెలుసుకుని, స్టేషన్ మేనేజర్ దుర్గరాజు, ఆర్టీసీ పోలీసులు సమక్షంలో మంగళవారం బాధితురాలికి ఆ డబ్బులు తిరిగి అప్పగించడం జరిగింది.

సంబంధిత పోస్ట్