రైలు ఢీకొని వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం

125చూసినవారు
రైలు ఢీకొని వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో శుక్రవారం తెల్లవారుజామున రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో రైలు ఢీకొని నెట్టి నారాయణరావు (36) అనే వ్యక్తి మృతి చెందాడు. తుమ్మకాపల్లి పంచాయతీ ఒడ్డిపేటకు చెందిన నారాయణరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్