నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గురువారం ఉదయం పొగమంచు మళ్ళీ మొదలైంది. గత వారం రోజులుగా లేని పొగమంచుతో పాటు చలి కూడా పెరిగింది. దీనివల్ల నగర పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పొగమంచుతో స్థానికులు జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని, తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య సిబ్బంది సూచించారు.