జీతాలు, బిల్లులు రాక ఆప్టా ట్రైనర్లు ఆవేదన

652చూసినవారు
జీతాలు, బిల్లులు రాక ఆప్టా ట్రైనర్లు ఆవేదన
రాష్ట్రంలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్న 2,990 మంది ఒకేషనల్ ట్రైనర్లు నెలల తరబడి జీతాలు, బిల్లులు చెల్లించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆప్టా రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు గణపతి రావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, 3-4 నెలలకు ఒకసారి కేవలం ₹24,000 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ICA, SRR సంస్థలు పెండింగ్ జీతాలు, బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేసి ట్రైనర్లకు న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్