విజయనగరం పట్టణంలో అక్టోబర్ 27వ తేదీన జరగనున్న శ్రీ పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవం సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి మంగళవారం ఉత్సవ ప్రాంతాలను పరిశీలించారు. రహదారులు, విద్యుత్ లైన్లను పరిశీలించి, రహదారి మరమ్మత్తు పనులను ఆమె ప్రారంభించారు. సిరిమాను తిరిగే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.