రేపు కలెక్టరేట్ లో 11:30 కి పిజిఆర్ఎస్

735చూసినవారు
రేపు కలెక్టరేట్ లో 11:30 కి పిజిఆర్ఎస్
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే ఉద్దేశంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం విజయనగరం కలెక్టరేట్లో ఉదయం 11. 30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు, ఫిర్యాదులు, వినతులను పీజీఆర్‌ఎస్‌లో సమర్పించి సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకురావచ్చని కలెక్టర్‌ సూచించారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కూడా పీజీఆర్‌ఎస్‌పై ప్రజలు తమ అభిప్రాయాన్ని, ఫీడ్‌బ్యాక్‌ను నమోదు చేసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్