విజయనగరం కంటోన్మెంట్ సబ్ స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. త్రినాథరావు తెలిపారు. అయ్యన్నపేట, పాల్నగర్, మహాలక్ష్మీనగర్, దుప్పాడ, జొన్నవలస, సారిక, ద్వారపూడి, దత్తరాజు గార్డెన్, గుంకలం, రామవరం, విజయనగరం కాలనీ, ఎస్కే డిగ్రీ కళాశాల, రామవరం డాల్ మిల్లు తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఏర్పడుతుంది. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.