జడ్పీ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ

355చూసినవారు
విజయనగరం జిల్లా జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన సర్వసభ సమావేశం గురువారం  జరిగింది. నీటి యాజమాన్యం, గ్రామీణ అభివృద్ధి, ఆరోగ్యం, విద్యుత్, విద్యాశాఖలపై సమీక్షించారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేకపోవడం, జీరో వడ్డీ రుణాలు, కొత్త పింఛన్లు, ఇళ్ల అనుమతులు, ఎన్ఆర్ఈజీఎస్ పనులపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు జారీ చేశారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్