ఐదేళ్లలోపు చిన్నారులకు రేపు పల్స్ పోలియో చుక్కలు

334చూసినవారు
ఐదేళ్లలోపు చిన్నారులకు రేపు పల్స్ పోలియో చుక్కలు
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదివారం జిల్లాలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ సమీప పోలియో కేంద్రాల్లో రెండు చుక్కల పోలియో మందు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్