విజయనగరంలో రెడ్ క్రాస్ కమిటీ సమావేశం

413చూసినవారు
విజయనగరంలో రెడ్ క్రాస్ కమిటీ సమావేశం
విజయనగరంలో ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ 2025-2026 3వ త్రైమాసిక మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్లడ్ బ్యాంక్, జనఔషధి మెడికల్ షాప్, ఐ డొనేషన్ సెంటర్, అంబులెన్స్ సేవల అభివృద్ధిపై చర్చించారు. 3వ త్రైమాసిక రాబడి, ఖర్చుల వివరాలను కోశాధికారి సభ్యులకు తెలియజేశారు. కమిటీ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా శాఖ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లా చైర్మన్ కె.ఆర్.డి.ప్రసాదరావు, వైస్ చైర్మన్ ఆర్. రాజ గోపాల్ నాయుడు, సెక్రటరీ కె. సత్యం, కోశాధికారి టి.రామారావు, పలువురు మేనేజింగ్ కమిటీ సభ్యులు, ఎస్.కోట సబ్ బ్రాంచ్ చైర్మన్ డా. కె.వరలక్ష్మీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్