రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా, విజయనగరం బస్ స్టేషన్ పరిధిలో రహదారి భద్రతపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. మయూరి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నినాదాలు చేసుకుంటూ సాగిన ఈ ర్యాలీలో, జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ ఏకాగ్రతతో బస్సులు నడపాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.