విజయనగరం పట్టణం గాజులరేగ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వద్ద శనివారం రెవల్యూషన్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శాంతి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. హై స్కూల్ సమీపంలో వైన్ షాప్ గత రెండు సంవత్సరాల నుండి నడిపిస్తూనే ఉండడంతో ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాపును వెంటనే తరలించాలని స్కూల్ పిల్లలు ఆర్ఎస్ యి సభ్యులు అధికారుల్ని కోరారు.