విజయనగరం, దాసన్నపేట చిన్న ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం జరిగిన ఉపనయన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాశీ మహా క్షేత్రం శ్రీ దత్త పీఠం దత్తాత్రేయ స్వామి ఉపాసకులు స్వామి సాధనానంద స్వామీజీ, ప్రతి హిందువు సనాతన ధర్మం పాటిస్తూ, దాని ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలని కోరారు. ఉపనయనం తల్లిదండ్రులు, గురువులు, సమాజం పట్ల బాధ్యతను పెంచుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు అల్లవెల్లి రామాచార్యులు, శారదా కుమారుడు సాయి సంపత్ చార్యులు పాల్గొన్నారు.