దత్తి గ్రామంలో మాఘ పౌర్ణమి ప్రత్యేక పూజలు

293చూసినవారు
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, పూజారి కందాడ హరి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్