కొత్తవలస మండల కేంద్రంలోని కుమ్మరి వీధిలో జరిగిన దొంగతనంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో మంగళవారం విజయనగరం క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. ఇంటి పరిసరాలను పరిశీలించి, వేలిముద్రలను సేకరించారు. ఈ దర్యాప్తులో స్థానిక ఎస్సై ఎన్. జోగారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.