నేడు ఆ మండలంలో కరెంట్ కట్

353చూసినవారు
నేడు ఆ మండలంలో కరెంట్ కట్
విజయనగరం పట్టణం చాకలిపేట సబ్‌స్టేషన్‌లో చేపట్టనున్న మరమ్మతుల పనుల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరా అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని ఈఈ త్రినాథరావు వెల్లడించారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనులు జరుగనున్నందున మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తామని తెలిపారు. మరిచర్ల, సుంకరిపేట, చెల్లూరు, బడుకొండపేట, రామాజోగిపేట, ముడిదాం, చాకలిపేట, గొల్లలాపేట, రామ్నారాయణం గ్రామాల్లో ఈ సమయంలో కరెంట్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్