కోనేటిలో ఈతకెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

3చూసినవారు
కోనేటిలో ఈతకెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుధరాయవలసలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని కోనేటిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందారు. చిన్నారులు నీటిలో మునిగిన విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విగతజీవులుగా పడి ఉన్న బిడ్డలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్