విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ గ్రామంలో బుధవారం పిఎసిఎస్ డైరెక్టర్ గా త్రిపురగిరి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా, రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకాంక్షించారు. రైతులకు అవసరమైన రుణాలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా పిఎసిఎస్ కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పి అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు.