విజయనగరం మండలంలోని సారిపల్లి కూడలి వద్ద సుమారు 60 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయాన్ని రెండవ పట్టణ సీఐ శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.