జనసేన నేత గురాన అయ్యలు కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించారు. ప్రజలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని, ఏపీకి సముచిత స్థానం కల్పించారని ఆయన ఆదివారం పేర్కొన్నారు. వికసిత్ భారత్ విజన్‌ను ప్రతిబింబించేలా, మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఈ బడ్జెట్ దేశ భవిష్యత్‌కు బ్లూ ప్రింట్ లాంటిదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 3,300 కోట్లు కేటాయించడం హర్షణీయమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంఎస్ఎంఈలకు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.