విజయనగరం జిల్లాలోని వక్ఫ్ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆదేశించారు. వక్ఫ్ పరిరక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్లో బుధవారం నిర్వహించారు. వక్ఫ్ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లాలో మొత్తం 99 వక్ఫ్ స్థలాలను గుర్తించడం జరిగిందని, వీటిలో 32 స్థలాలను ఇప్పటికే నోటిఫై చేయడం జరిగిందని చెప్పారు.