నవంబర్ 2025లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సివిల్ సర్వీస్ కబడ్డీ సెలక్షన్ లో మంచి ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులు, ఈ నెల 9 నుండి 14వ తేదీ వరకు పంజాబ్ రాజధాని చండీగఢ్ లో జరగబోయే జాతీయ సివిల్ సర్వీస్ ఉద్యోగుల కబడ్డీ ఛాంపియన్షిప్ లో ఆంధ్ర సివిల్ సర్వీస్ ఉద్యోగుల జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సురేష్ బాబు తదితరులు వారిని అభినందించారు.