విజయనగర పట్టణం సరస్వతి దేవి టెంపుల్ ఎస్ వి ఎన్ నగర్ లో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా నమో సేవ గాధ ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పివియన్ మాధవ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం వ్యాపారవేత్త రవ్వ శ్రీనివాస్ ను మాధవ్ కండువా కప్పి బిజెపి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లాలో బిజెపి పార్టీని అభివృద్ధి పథంలో నడిపించాలని మాధవ్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.