విజయనగరం జిల్లాలో ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరుతూ, జిల్లా పౌరవేదిక అధ్యక్షులు శ్రీ భీశెట్టి బాబ్జి ఫిబ్రవరి 4వ తేదీన రామానాయుడు చెరువు గట్టున ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ నిరసనలో ప్రజా సంఘాలు కూడా పాల్గొంటాయని తెలిపారు.