విజయనగరం జిల్లాలో నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు JC సేధు మాధవన్ తెలిపారు. శనివారం JC కోర్టులో జరిగిన విచారణలో, జిల్లా ఆహార భద్రతాధికారి నాగల్ మీరా నమోదు చేసిన 10 ఫిర్యాదులపై విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై రూ.2,83,500ల జరిమానా విధించారు. ఆహార పదార్థాల్లో కల్తీ, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.