హోంమంత్రి అనిత విజయనగరం సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించి, ఖైదీలతో మాట్లాడారు. వంటగదిని పరిశీలించి, భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ ను కూడా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించి, పోలీసులకు సీసీ కెమెరాల పనితీరుపై సూచనలు చేశారు.