వైసిపి యువజన అధ్యక్షుడిగా దత్తి చిరంజీవి పునర్నియామకం

43చూసినవారు
వైసిపి యువజన అధ్యక్షుడిగా దత్తి చిరంజీవి పునర్నియామకం
దత్తిరాజేరు మండల వైసిపి యువజన విభాగం అధ్యక్షుడిగా వంగర గ్రామానికి చెందిన దత్తి చిరంజీవి వరుసగా రెండోసారి శనివారం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ, వైసిపి పార్టీని మండలంలో మరింత బలోపేతం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ వార్తపై గ్రామస్థులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్