విజయనగరం గాజులరేగ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిసరాల్లో వైన్ షాప్ ఏర్పాటుతో రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎక్సైజ్ అధికారులు వైన్ షాపులు రేపటి నుంచి రెండు నెలల పాటు కొనసాగుతాయని చెప్పగా, స్థానికులు దానిని పూర్తిగా తొలగించాలని పట్టుబట్టారు.