YCPలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో పార్టీకి అనుకూలంగా పనిచేసిన పాషా, కె.ఎస్. ప్రసాద్ వంటివారు ఇప్పుడు పార్టీ అగ్రనేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సాక్షి ఛానెల్‌లో డిబేట్లకు హాజరుకాబోమని వారు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. YSR సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియాలో పనిచేసే వారికి ఆశించిన స్థాయిలో చెల్లింపులు జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీలో ఇటువంటి వాటిని సజ్జల రామకృష్ణారెడ్డి హ్యాండిల్ చేసేవారు. అయితే ఇప్పుడు చెల్లింపులు నిలిపివేయడంతో ఆయన టార్గెట్ అవుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.