విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు

4136చూసినవారు
విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు
బెంగళూరు నుంచి వారణాసికి వస్తున్న ఇండిగో విమానంలో శనివారం రాత్రి 10:20 గంటలకు ల్యాండ్ అవుతుండగా, 26 ఏళ్ల మహమ్మద్ అద్నాన్ అనే ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరవడానికి ప్రయత్నించాడు. క్యాబిన్ సిబ్బంది అడ్డుకోవడంతో పైలట్ ల్యాండింగ్‌ను నిలిపివేసి, విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లారు. 15 నిమిషాల తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విచారణలో నిందితుడు తనకు దయ్యం పట్టిందని, ఆ తర్వాత బటన్ నొక్కితే తలుపు తెరుచుకుంటుందని తెలియదన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రాథమిక విచారణ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్