దేశవ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా పాస్‌పోర్టు ఫీజులను కేంద్రం 70 శాతం పెంచింది. 36 పేజీల పాస్‌పోర్టు ఫీజు రూ.2,500, తత్కాల్ ఫీజు రూ.5 వేలకు పెరిగింది. 60 పేజీల పాస్‌పోర్టు ఫీజు రూ.3,500, 60 పేజీల తత్కాల్ ఫీజు రూ.6 వేలకు చేరింది. మైనర్ల పాస్‌పోర్టు ఫీజు రూ.1,750గా నిర్ణయించారు. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.