AP: నర్సీపట్నం సబ్ జైలు నుండి పాస్టర్ అభినవ్ దర్శన్ విడుదలయ్యారు. 8 రోజుల జైలు వాసం తర్వాత, నర్సీపట్నం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాడేరు నియోజకవర్గంలో తన పాదయాత్రను ఎలాంటి విరామం లేకుండా కొనసాగిస్తానని ఆయన తెలిపారు. తన పాదయాత్ర కొనసాగింపుపై చాలామందిలో సందేహాలున్నాయని ఆయన పేర్కొన్నారు.