రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చాం. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలను అరికట్టేలా చర్యలు చేపట్టాం. నాలా చట్టాన్ని రద్దు చేసి పారిశ్రామికవేత్తలకు, భూయజమానులకు ఇబ్బందులు లేకుండా చేశాం’ అని వివరించారు.