కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో మంత్రి నారా
లోకేశ్ ప్రసంగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అన్నగా అభివర్ణిస్తూ, ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రతిపక్ష నేత
జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పిస్తూ, గత
వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులను వేధించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగాలని, రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మద్దతు కోరారు. శుక్రవారం జరిగిన ఈ సభలో కూటమి అగ్రనేతలు పాల్గొన్నారు.